ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు తెలిపారు. గురువారం భీమిలి టిడిపి కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నాలుగు లక్ష్యాలతో రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతం పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శుభ పరిణామం అన్నారు.