గుంటూరు: రత్నగిరి నగర్ నీటి సమస్య పరిష్కరించండి
పలకలూరు రోడ్డు రత్నగిరి నగర్ లో నీటి సమస్య అధికంగా ఉందని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదుగురు ఉంటున్న ఇంటికి 10రోజులకు ఒకసారి ఒక డ్రమ్ము నీటిని ట్యాంకర్ల ద్వారా ఇస్తున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని సోమవారం వారు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. 25 ఏళ్లుగా తాము ఉంటున్నామని, అధికారులు నీటి కొళాయిలు ఏర్పాటు చేయాలని రత్నగిరి నగర్ వాసులు కోరుతున్నారు.