గుంటూరు కొరిటెపాడు కరణంగారి వీధిలో బుధవారం జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 8 అంగుళాల పాత భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను తొలగించకుండానే దానిపై కొత్తగా 10 అంగుళాల పైపును ఏర్పాటు చేశారని అంటున్నారు. ఎత్తు పెంచిన నూతన పైప్ లైన్ కారణంగా భూగర్భ డ్రైనేజీ నీరు ఇంట్లోకి వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.