డొంకరోడ్డు మూడొంతెనల మార్గం మూతపడిన కారణంగా గుంటూరు నగరంలో ట్రాఫిక్ తీవ్రగా ప్రభావితం అవుతోంది. సోమవారం ఉదయం, సాయంత్రం విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాల అధిక రాకతో రహదారులు రద్దీగా మారాయి. నెహ్రూనగర్, సంజీవయ్యనగర్, మంగళదాస్ నగర్ రైల్వేగేట్లు వద్ద వాహనాలు గంటలు పడుతూ దాటడం వాహనచోదకులపై ఒత్తిడి తీసుకురావడమే కాక, కొంతమంది యువకులు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు.