రాజకీయ పార్టీలు సమయమనం పాటించాలి

72చూసినవారు
రాజకీయ పార్టీలు సమయమనం పాటించాలి
ఎగ్జిట్ పోల్స్ విడుదల, ఈనెల 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు సమయమనం పాటించి శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు తోడ్పాటు అందించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళి కృష్ణ విజ్ఞప్తి చేశారు. శనివారం సాయంత్రం మాడుగుల కన్యకా పరమేశ్వరి ఆలయ కళ్యాణ మండపంలో నిర్వహించిన రాజకీయ పక్షాల అవగాహన సదస్సులో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని దిశా నిర్దేశం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.