మాడుగుల: శివాలయం షెడ్ నిర్మాణానికి రూ.10 వేలు విరాళం
మాడుగుల మండలం ఏం కోడూరు గ్రామంలోని శివాలయంలో షెడ్డు నిర్మాణానికి విశ్రాంత ఏఆర్ పోలీస్ రాపర్తి సూర్యనారాయణ సత్యవతి దంపతులు పదివేల రూపాయలు విరాళంగా ఆదివారం ఆలయ కమిటీ అధ్యక్షుడు చింత వెంకటనారాయణమూర్తి కార్యదర్శి పడాల అప్పల నరసయ్య కు అందజేశారు. ఈ సందర్భంగా వారు దాతలను అభినందించి ఆ కాశీ విశ్వేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.