కోటవురట్ల మండలానికి కేటాయించిన సర్వే రాళ్లపై పేర్లను తొలగించే కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో భూములను రీసర్వే చేసిన అనంతరం స్టోన్ ప్లాంటేషన్ కోసం వీటిని ప్రతి గ్రామానికి సరఫరా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేరాళ్లపై పేర్లను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు రాళ్లపై ఉన్న 'వైఎస్సార్ జగనన్న భూరక్ష' పేరును తొలగిస్తున్నారు.