ఘనంగా కొండకర్లలో ఎల్లారమ్మ-పేరంటాల జాతర

73చూసినవారు
ఘనంగా కొండకర్లలో ఎల్లారమ్మ-పేరంటాల జాతర
మండలంలోని కొండకర్ల గ్రామంలో బుధవారం ఎల్లారమ్మ- పేరంటాలు జాతర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అందాలపల్లి, కొండకర్ల, చీమలపల్లి, ఎర్రవరం తదితర గ్రామాలకు చెందిన అనేకమంది భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. భక్తులకు నిమ్మరసం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండ్ల వేషాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్