
ఎలమంచిలి: ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం
సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం సిఐటియు జెండాని ఫ్యూజన్ బ్రిక్స్ కంపెనీ వద్ద, పట్టణంలో ధర్మవరం వీధిలో సిఐటియుజ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు యలమంచిలి మండల కన్వీనర్ చింతకాయల శివాజీ మాట్లాడుతూ సిఐటియు 1970 మే 31న ఏర్పడి అప్పటినుంచి నేటి వరకు ఎనలేని పోరాటాలు నిర్వహించిందని అన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో కూడా కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేసిందన్నారు.