అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో వారం సంతలు జోరుగా సాగాయి. గొర్రెలు, మేకలు, పశువులను పెద్ద సంఖ్యలో తీసుకొచ్చారు. శని, ఆదివారాలు రెండ్రోజులుగా యార్డ్ అంతా వ్యాపారులు, రైతులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సంత జరిగింది. వారం సంతల్లో మొత్తం రూ. 4, 30, 075ల ఆదాయం వచ్చింది. అందులో గొర్రెలు, మేకల సంతలో 5. 2, 67, 725, ລ້ລ້ ລ້ 5. 1, 62, 350~ ఆదాయం వచ్చిందని మార్కెట్ అధికారులు తెలిపారు.