
అనంతపురం: టీడీపీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాజరై జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.