అనంతపురంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం అన్న క్యాంటీన్ ను తెలుగు మహిళా నేతలు ప్రారంభించారు. తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్య దర్శి తుల్జాపూర్ స్వప్న మాట్లాడుతూ. పేదవాడి కడుపును నింపాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో ఆమెతో పాటు తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని, గాండ్ల సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ విశాలాక్షి పాల్గొన్నారు.