గుత్తి చెరువుకు భారీగా వరద నీరు

64చూసినవారు
గుత్తి చెరువుకు వరద నీరు భారీగా చేరుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద గుత్తి చెరువుకు పోటెత్తింది. మంగళవారం నాటికి 45 శాతం చెరువు నిండినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మరోపక్క గుత్తి చెరువుకు నీరు భారీ ఎత్తున రావడంతో చుట్టుపక్కల బోర్లలో నీరు సమృద్ధిగా లభిస్తోంది. చెరువుకు నీరు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you