తాడిపత్రి మండలంలో పేకాట స్థావరాలపై బుధవారం సాయంత్రం సీఐ శివ గంగాధర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. మండలంలోని గన్నేవారిపల్లి కాలనీలో పేకాట ఆడుతున్న ఐదు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 5 వేల నగదుతో పాటు 5 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ శివ గంగాధర్ రెడ్డి తెలిపారు.