వివిధ పనుల నిమిత్తం సచివాలయాలకు వచ్చే ప్రజలకు ఉద్యోగులు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి సూచించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం సచివాలయ సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా అధికారులు, ఉద్యోగులు ఉంటారన్నారు. సచివాలయాలకు వచ్చే ప్రజలను విసుక్కోకుండా వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.