ఉరవకొండ ఎంఈఓ ఈశ్వరప్ప పై చర్యలు తీసుకోవాలని ఉరవకొండ ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేసారు విద్యార్ధి సంఘాల నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉరవకొండ పట్టణంలోని ప్రవేట్ పాఠశాలల యాజమాన్యలపై చర్యలు తీసుకోవడంలో ఎంఈఓ వెనకడుగు వేస్తున్నారన్నారు. పలు ప్రవేట్ పాఠశాలలో సరైనటువంటి ప్లేగ్రౌండ్ లు లేవన్నారు. అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు.