అనంతపురంలోని వడ్డెర్ల సంఘం కార్యాలయంలో సోమవారం ఉమ్మడి అనంత జిల్లాల అధ్యక్షుడు కుంచపు వెంకటేశులు, రాష్ట్ర అధ్యక్షుడు దేవల్ల మురళి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్ద పీట వేసిందన్నారు. ఈ నెల 8న బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల వివరాలు ఆన్ లైన్ లో విడుదల కానున్నాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.