అనంతపురం నగరంలోని 41వ డివిజన్లో శనివారం నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్యెల్యే మాట్లాడుతూ. రానున్న రోజుల్లోనే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. త్వరలోనే అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్యెల్యేతో పాటు మాజీ మేయర్ స్వరూప, తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని, తదితరులు పాల్గొన్నారు.