ధర్మవరం పట్టణం శాంతినగర్ కు చెందిన మచ్చా వెంకటేశ్వర్లు (74) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. విశ్వదీప సేవా సంఘం వారు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు బుధవారం నేత్రదానంపై అవగాహన కల్పించారు. కుటుంబ సభ్యుల సహకారంతో విశ్వ దీప సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అందత్వ నివారణ సంస్థ, హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్ శ్రీకాంత్ నేత్రాలను సేకరించారు.