ధర్మవరంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఎస్సై వెంకటరాముడు పేర్కొన్నారు. బుధవారం ధర్మవరం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కళాజ్యోతి సర్కిల్, అంజామాన్ సర్కిల్ వరకు అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. తోపుడుబండ్ల వ్యాపారస్తులు రోడ్డు మధ్యలో వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా నిర్వహించుకోవాలన్నారు.