ధర్మవరం పట్టణంలోని
ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న పురాతన పాండురంగ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులను మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఆలయానికి వచ్చిన మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, జీర్ణోద్ధరణ పనులను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ పనులకు కోటి 25 లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు మంత్రి తెలిపారు.