రామగిరి మండలం నసనకోటలో సోమవారం టీడీపీ నాయకులు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు శ్రీధర్ నాయుడు మాట్లాడుతూ.. రూ.100 చెల్లించి టీడీపీ సభ్యత్వ నమోదు పొందడం వల్ల రూ.5లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రామాంజి, శ్రీనివాసులు, ముత్యాలప్ప, బాబు తదితరులు ఉన్నారు.