ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రసన్నాయిపల్లి పంచాయతీ పరిధిలోని కళాకారుల కాలనీని పరిశీలించారు. సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కళాకారుల కాలనీలోని ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఈ విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ మంగళవారం అధికారులతో కలిసి కాలనీకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు.