కూటమి ప్రభుత్వంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈ నెల 27న నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ నాయకుడు గుర్రం శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాలతో ధర్మవరంలో ఈ నెల 27న విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. పోరుబాటు పోస్టర్ను విడుదల చేశారు.