గుత్తి: లీకేజ్ అవుతున్న పైప్ లైన్లను మరమ్మతు చేయిస్తాం
గుత్తి మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రాంతాల్లో సత్యసాయి, వైటీసీ, మున్సిపల్ తాగునీటి పైప్లైన్లు లీకేజ్ అవుతున్నాయి. లీకేజ్ అవుతున్న పైప్ లైన్లను బుధవారం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలో, అనంతపురం రోడ్డులో, కర్నూలు రోడ్డులో లీకేజ్ అవుతున్న పైప్ లైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లీకేజ్ అవుతున్న పైప్ లైన్ లన్నింటినీ మరమ్మతులు చేయిస్తామన్నారు.