పన్ను వసూళ్లలో, ధరల నియంత్రణలో, జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే తెలంగాణ నం.1 స్థానంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 88 శాతం పన్నుల వసూళ్లతో తెలంగాణ ఉండగా.. 86 శాతం మహారాష్ట్ర రెండో స్థానంలో ఉందని చెప్పారు. ద్రవ్యోల్బణ నియంత్రణలో తెలంగాణ 1.3%తో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని.. కేరళలో 7.1% గా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటును 8.8% నుంచి 6.1% కు తగ్గించామని వెల్లడించారు.