వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గానూ యాంకర్ శ్యామలపై సోమవారం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు కావడంతో వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న శ్యామలకు గట్టి షాక్ తగిలినట్టైంది. ఆమెపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.