గుత్తిలోని బైబిల్ మిషన్ చర్చిలో బుధవారం క్రిస్మస్ వేడుకలను పాస్టర్ రెవరెండ్ అద్భుత కుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవులు అత్యంత ఘనంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది క్రైస్తవ జనులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. యేసయ్య అనే నినాదాలతో బైబిల్ మిషన్ చర్చితో పాటు పరిసర ప్రాంతాలు మార్మోగాయి. చర్చి క్రైస్తవులతో కిక్కిరిసిపోయింది. కాలు పెట్టడానికి కూడా వీలు లేనంతగా భక్తజనులు వచ్చారు.