రైల్వే వ్యాగన్ లో అగ్ని ప్రమాదం

7442చూసినవారు
గుంతకల్ రైల్వే డివిజన్లో బొగ్గును రవాణా చేసే వ్యాగన్లో అగ్ని ప్రమాదం జరగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈఘటన ఆదివారం గుంతకల్లు రైల్వే డివిజన్ గుంతకల్లు-ఆదోని సెక్షన్ నేమకల్లు రైల్వే స్టేషన్లో జరిగింది. వ్యాగన్లో ఉన్న బొగ్గుకు ఎండవేడిమితో నిప్పు ఏర్పడడం ప్రమాదానికి కారణమని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. సమాచారాన్ని స్టేషన్ సిబ్బంది గుంతకల్లులోని రైల్వే అధికారులకు అందించారు.

సంబంధిత పోస్ట్