గుమ్మనూరు జయరాంకు టికెట్టు ఇస్తే ఘోరంగా ఓడిస్తాం: టిఎన్ఎస్ఎఫ్

4883చూసినవారు
మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కు గుంతకల్లు అసెంబ్లీ టికెట్టు ఇస్తే ఘోరంగా ఓడిస్తామని టిడిపి, తెలుగు యువత నాయకులు అన్నారు. జయరామ్ టిడిపిలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం గుంతకల్లు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ఎన్టిఆర్ విగ్రహాన్ని పాలతో శుద్ధిచేశారు. అనంతరం నాయకులు సురేష్, నందీశ్వర మాట్లాడుతూ తమ యువనేత లోకేష్ ను బూతులు తిట్టిన జయరామ్ టిడిపిలో చేరడం సిగ్గుచేటని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్