మద్యం విక్రేతల అరెస్ట్

68చూసినవారు
మద్యం విక్రేతల అరెస్ట్
గుత్తి మండలంలోని బాచుపల్లి గ్రామ శివారులో ఉన్న దుకాణాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్ట్ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. ఎలాంటి అనుమతుల్లేకుండా అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం తెలియటంతో గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మద్యం విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్కు తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్