వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపడతాం: మున్సిపల్ కమిషనర్

76చూసినవారు
వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపడతాం: మున్సిపల్ కమిషనర్
గుత్తి మున్సిపల్ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు అతి త్వరలో చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసులు మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ మధ్య కాలంలో వీధి కుక్కలు ప్రజలపై దాడులు చేసి కరవడం దృషితో ఉంచుకుని అనిమల్ బర్త్ కంట్రోల్ మార్గదర్శకాల ప్రకారం వాటికి కుటుంబ నియంత్రణ కోసం ఏజెన్సీకి తెలియజేశామన్నారు. త్వరలో కుక్కల నియంత్రణకు వ్యాక్సినేషన్ చేపడతామని ప్రజలు ఆందోళన చెందరాదని తెలిపారు.

సంబంధిత పోస్ట్