Oct 26, 2024, 15:10 IST/బాన్సువాడ
బాన్సువాడ
అట్లూరు ఎల్లారెడ్డి సొసైటీలో వరి కొనుగోలు సన్నాహక సమావేశం
Oct 26, 2024, 15:10 IST
సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీలో చైర్మన్ మర్రి సదాశివరెడ్డి అధ్యక్షతన శనివారం వరి కొనుగోలు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా సహకార అధికారి రామ్మోహన్ మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి సాయిలు, సూపరింటెండెంట్ ప్రశాంత్, సీఈఓ బైరయ్య, వైస్ చైర్మన్ పశుపతి, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.