ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇంటి పట్టాలు తన వద్ద పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేసి బెదిరించిన కేసులో కదిరి మండలం సున్నపుగుట్ట తాండాకు చెందిన సోమ్ల నాయక్ ను అరెస్ట్ చేసినట్లు కదిరి పట్టణ సిఐ నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మీడియాతో మాట్లాడుతూ సోమ్ల నాయక్ మాజీ ఎమ్మెల్యే చాంద్ భాష ప్రోత్బలంతో పట్టాలు తయారు చేసినట్లు తెలిపారు. చాంద్ భాషను ముద్దాయిగా చేసినట్లు తెలిపారు. చాంద్ భాష పాత్ర పై విచారణ చేస్తామని తెలిపారు.