కళ్యాణదుర్గం: రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయండి: ఎమ్మెల్యే
కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజా వేదికలో మంగళవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు విలేఖరులు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేది మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందరూ హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.