ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా రోజూ సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయని చెప్పారు. ఉత్సవమూర్తులకు రాత్రి 7 గంటల నుంచి గ్రామోత్సవం జరుగుతుందన్నారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోనున్నారు.