కళ్యాణదుర్గం పట్టణంలో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించి విద్యుత్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త తలారి రంగయ్య మాట్లాడుతూ సంపద సృష్టించి ప్రజాసంక్షేమం చేస్తానని చెప్పిన చంద్రబాబు, ధరలు పెంచి సంపద సృష్టిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం సాగిస్తూనే ఉంటామని తెలిపారు.