అనంతపురం జిల్లాలెని కుందిర్పిలో ఆదివారం అరుదైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బంతల ఈరన్నకు చెందిన గొర్రె ఓకే ఈతలో నాలుగు గొర్రె పిల్లలకు జన్మనిచ్చింది. ీ విషయం తెలుసుకున్న కుందుర్పి పశు వైద్య అధికారి ప్రసాద్ గొర్రెల మందను సందర్శించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయని, ముఖ్యంగా జన్యుపరంగా మాత్రమే ఇలా అరుదుగా జరుగుతాయని వివరణ ఇచ్చారు.