అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలంలోని ఒంటిమిది గ్రామం వద్ద శనివారం ఆటోను గుర్తుతెలియని బొలెరో వాహనం ఢీ కొనింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి చిన్నపాటి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఇటువంటి ప్రాణాపాయం లేదని తెలపడంతో ఊపిరి పిలుస్తున్నారు.