కళ్యాణదుర్గం: గురుకుల పాఠశాల పనులు పూర్తి చేసేలా చూస్తాం

60చూసినవారు
కళ్యాణదుర్గం: గురుకుల పాఠశాల పనులు పూర్తి చేసేలా చూస్తాం
కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో అర్ధాంతరంగా ఆగిపోయిన గురుకుల పాఠశాల నిర్మాణాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు శనివారం పరిశీలించారు. నిర్మాణం ఆగిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో పనులు పూర్తి చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్