సీఎం సమావేశంలో పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు
దళిత ఎమ్మెల్యేలతో సీఎం కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మడకశిర శాసనసభ్యులు ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల దళిత ఎమ్మెల్యేలతో చర్చించారు. వర్గీకరణ అమలు ద్వారా దళిత ఉపకులాలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. విద్యా, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ది, వ్యాపార అవకాశాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.