నార్పలలో స్వర్ణాంధ్ర @2047 పై గ్రామసభ
నార్పల మేజర్ పంచాయతీ కార్యాలయంలో స్వర్ణాంధ్ర @2047 పై గ్రామ సభ బుధవారం నిర్వహించారు. గ్రామ సభకు గ్రామ సర్పంచ్ మాన్నిల సుప్రియ, మండల స్పెషల్ ఆఫీసర్ రామసుబ్బారెడ్డి, ఎంపీడీఓ దివాకర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ. గ్రామాల్లో అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలు తయారీకి ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణకు గ్రామ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.