నార్పల మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు కమ్మరి కాశీ విశ్వనాథ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి సభ్యత్వాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మం, న్యాయం, దేశ అభివృద్ధి కోసం, పని చేసే బీజేపీని బలపరచాలని ప్రజలను కోరారు. ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసం చేసిన సేవలు వివరించారు.