నార్పల: అంగన్వాడి కార్యకర్తలకు నియామక పత్రాలు అందజేత
నార్పల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో కొత్తగా ముగ్గురు కార్యకర్తలు ఎంపికయ్యారని సీడీపీఓ భారతి తెలిపారు. బుధవారం వారిలో శెనగల గూడూరు 2వ సెంటర్ కు తేజస్వని, పుట్లూరు 2వ సెంటర్ కు కాంతమ్మ, నార్పల తిక్కస్వామి 2వ సెంటర్ కు విజయేశ్వరి సహాయకులుగా ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించినట్లు వారు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.