Oct 22, 2024, 15:10 IST/
TG: అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
Oct 22, 2024, 15:10 IST
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినట్లు వాతావరణశాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో బుధవారం తెలంగాణలో నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.