VIDEO: గ్రూప్-1 అభ్యర్థికి పోలీసుల సాయం

57చూసినవారు
TG: గ్రూప్-1 అభ్యర్థులకు పోలీసులు సహాయం చేశారు. పోచారం ఐటీసీ సీఐ రాజు వర్మ ఆధ్వర్యంలో పీఎస్‌ పరిధిలోని కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చౌదరిగూడలోని ఓ పరీక్షా కేంద్రానికి వెళ్తున్న అభ్యర్థికి లేట్ అవ్వడంతో పోలీసులు అతడికి భరోసా ఇచ్చారు. సదరు అభ్యర్థిని పెట్రోలింగ్ వాహనంలో నిమిషాల వ్యవధిలో పరీక్షా కేంద్రానికి తరలించారు. పోలీసుల సేవలను పలువురు ప్రశంసించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్