పామిడి: దేవాలయ గర్భగుడి నిర్మాణ పనుల పరిశీలన
పామిడి పట్టణంలోని శ్రీ భోగేశ్వరస్వామి దేవాలయ గర్భగుడి నిర్మాణ పనులను దేవాదాయ, ధర్మదాయ రాష్ట్ర డిప్యూటీ స్థపతి నెహ్రు బుధవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. నిర్మాణంలో లోటుపాట్లు లేకుండా చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఆలయ ఛైర్మన్ మురళీధర్, డిప్యూటీ స్థపతి సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ స్థపతి మాధవి, టీడీపీ మండల ఇన్ఛార్జి ఆర్ఆర్ రమేశ్, అర్చకులు రామేశ్వర శర్మ, వెంకటరాముడు పాల్గొన్నారు.