జగన్‌కు దమ్ముంటే బైబిల్ మీద ప్రమాణం చేయాలి: షర్మిల

546చూసినవారు
జగన్‌కు దమ్ముంటే బైబిల్ మీద ప్రమాణం చేయాలి: షర్మిల
ఏపీ మాజీ సీఎం జగన్‌పై ఏపీపీసీసీ చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. అదానీ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. అబద్ధాలను అందంగా అల్లినందుకు అవార్డు ఇవ్వాలని.. అదానీతో జగన్ ఒప్పందం అంతర్జాతీయంగా చరిత్రే అంటూ ఎద్దేవా చేశారు. మీరు అవినీతి చేశారని చెప్పింది మేము కాదని, అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు FBI, SEC స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయని అన్నారు. దర్యాప్తు సంస్థలు తప్పుడు ఆరోపణలు ఇచ్చాయనుకుంటే.. దమ్ముంటే బైబిల్ మీద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్