వైన్స్ షాపు గోడకు కన్నం పెట్టి మద్యం బాటిళ్లు చోరీ చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో చోటుచేసుకుంది. శంషాబాద్ మండలంలోని పాలమాకు గ్రామంలో శుక్రవారం లక్ష్మీ నరసింహ వైన్స్ లో గుర్తు తెలియని దుండగులు గోడను కూల్చి మద్యం బాటిళ్లను దొంగిలించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మాస్కులు ధరించి లోపలికి వెళ్లి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు CCTVలో రికార్డయింది.