పామిడి కి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుర్రం నారాయణస్వామి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సోమవారం పామిడి కి వెళ్లి నారాయణస్వామి భౌతికాయం పై పూలమాలవేసి నివాళులర్పించారు. నారాయణస్వామి మృతి తనను కలిచివేసిందని శివరాం రెడ్డి చెప్పారు. మంచి స్నేహితున్ని కోల్పోయానన్నారు.